Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔట్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ''లక్కీ లక్ష్మణ్''. శరవేగంగా షఉటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి మాట్లాడుతూ.. ''లక్కీ లక్ష్మణ్'' ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు.వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు తను నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ... మా అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా ''లక్కీ లక్ష్మణ్'' ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు.ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.