Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ నటనలో ఓ ఫైర్ ఉంది.. 'ది వారియర్' కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ శంకర్. పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. లెజెండ్రీ డైరెక్టర్ భారతీ రాజా మాట్లాడుతూ ''మణిరత్నంగారు.. నార్త్‌లో షఉటింగ్ చేస్తోన్న శంకర్ సహా ఇంత మంది దర్శకులు ఇక్కడకు వచ్చారంటే కారణం లింగుసామిగారే. ఆయనపై అభిమానమే. ది వారియర్ సినిమాను తను తెరకెక్కించిన విధానం అద్భుతం. బుల్లెట్ సాంగ్, విజిల్ సాంగ్‌కు అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. రామ్ ఇక్కడ హీరోగా పరిచయం అవుతున్నారు. తను డాన్సులు చూశాను.. బ్యూటీఫుల్. ఓ రకంగా అసూయ పడ్డాను.
నాకు కాస్త వయసు తక్కువగా ఉండుంటే నేను కూడా వీరితో కలిసి చేసేవాడిని కదా అనిపించింది. తెలుగు సినిమా ఇండిస్టీ ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన గ్రాండియర్‌కు శంకర్‌లాంటి దర్శకుడు దారి చూపించాడు. శంకర్ ఆలోచనను చూస్తే ఆశ్చర్యపోతున్నాను. లింగుసామి టెక్నికల్‌గానూ సినిమాను అద్భతుంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడున్న దర్శకులంతా గొప్ప గొప్పవారు. ఎన్నెన్ని జన్మలెత్తినా సినిమా డైరెక్టర్‌గానే పుట్టాలని కోరుకుంటాను'' అన్నారు. ఏస్ డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ ''లింగుస్వామి ఈ సినిమా కోసం ఇంత మంది వారియర్స్‌ను తీసుకొస్తాడని తెలుసుంటే నా సినిమాకు సంబంధించిన వార్ సీన్స్‌ను ఇక్కడే చేసుండేవాడిని.
లింగుస్వామి చాలా మంచి వ్యక్తి. కోవిడ్ సమయంలో ఇక్కడ అందరి డైరెక్టర్స్‌ను సంధానం చేశాడు. తన వల్ల నాకు ప్రతి ఒక డైరెక్టర్‌తో పర్సనల్‌గానూ మంచి అనుబంధం ఏర్పడింది. నేను నా పొన్నియన్ సెల్వన్‌ను హైదరాబాద్‌లో షఉట్ చేస్తున్నప్పుడు లింగుస్వామి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన తర్వగా పూర్తి చేసేశారు. ఆయన రోడ్ బాగా వేస్తే.. వెనకాలే నేను కూడా వచ్చేస్తాను. ది వారియర్ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్'' అన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ''ది వారియర్.. చాలా మంచి టైటిల్. అందరం జీవితంలో ఏదో సాధించటానికి ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ సహా అన్ని పాటలు బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌కి అభినందనలు. రామ్ కోసం ఈ సినిమా చూడబోతున్నాను. కృతి శెట్టి.. మంచి నటిగా ఎదిగి నేషనల్ అవార్డ్‌ను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. లింగుసామి మంచి స్నేహితుడు. కరోనా సమయంలో నాకు చాలా సమస్యలు వచ్చాయి. తనతో చెప్పుకుంటే తను అండగా నిలబడ్డారు.