Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాక్షన్ ఎంటర్టైనర్ షంషేరాతో లార్జర్ దాన్ లైఫ్ క్వింటెసెన్షియల్ హిందీ సినిమా హీరోగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ సంజు అనంతరం నాలుగేళ్ల తర్వాత పెద్ద తెరపైకి వస్తున్న రణ్‌బీర్, ఒరిజినల్ కథల్లో భాగం కావడం తనకు చాలా ఇష్టమని, తన సినిమాల్లో ఒరిజినల్ మ్యూజిక్ ఉండటాన్ని ఇష్టపడతానని చెప్పారు. రీమిక్స్‌ల యుగంలో కూడబా షంషేరా ఒరిజినల్ మ్యూజిక్‌తో అందరినీ అలరించేందుకు వస్తున్నందుకు ఆయన చాలా సంతోషిస్తున్నారు. ఇందులోని సంగీతం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన ధీమాతో ఉన్నారు. దీని గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ, నిరీమిక్స్లను తగ్గించి మాట్లాడడం లేదు. ప్రపంచంలో వాటికి తనదే అయిన స్థానం ఉంది. అలాగే వాటిని ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తారు. కానీ, నేను ఒరిజినల్ కథలు, ముఖ్యంగా ఒరిజినల్ సంగీతంలో భాగం కావాలనుకుంటున్నాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా విజయాలు మరియు ప్రజాదరణ అంతా నా సినిమాల్లోని మ్యూజిక్‌తోనే అందుకున్నాను అని పేర్కొన్నారు. దీని గురించి మరింత వివరిస్తూ, అది మోహిత్ చౌహాన్ లేదా అరిజిత్ సింగ్ లేదా ప్రీతమ్ లేదా ఎ.ఆర్.రెహమాన్ లేదా నేను పనిచేసిన విభిన్న మ్యుజీషియన్స్ ఎవరైనా కావచ్చు వారు నటుడిగా మరియు స్టార్‌గా నా ఎదుగుదలకు కీలక పాత్రను పోషించారు. షంషేరాతో అది నన్ను మరో అడుగు ముందుకు తోడ్కొని వెళుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. షంషేరాలోని మొదటి పాట జీ హుజూర్ మరియు నేడు విడుదల చేసిన రొమాంటిక్ ట్రాక్ ఫితూర్ అనే రెండో పాట, రెండూ సిట్యుయేషనల్ పాటలు కాగా, సినిమా కథనాన్ని ముందుకు తీసుకు వెళతాయి. ఫితూర్ పాటను అరిజిత్ సింగ్, నీతి మోహన్ పాడారు. రణబీర్ అద్భుతమైన లవ్ ట్రాక్ పాటతో ఎమోషనల్‌గా ప్రేక్షకులతో చక్కగా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నారు. దీని గురించి మాట్లాడుతూ, నేను ఫితూర్ పాటను ప్రేమిస్తున్నాను. ఇది మనోహరమైన రొమాంటిక్ ట్రాక్. ప్రజలు కూడా ఇష్టపడతారని నేను భావిస్తున్నాను. ఫితూర్ స్థాయి అద్భుతంగా ఉంటూ, ఇది భారీ స్క్రీన్‌పై మరింత గ్రాండ్‌గా కనిపిస్తుంది అని తెలిపారు. షంషేరా మ్యూజిక్ ఆల్బమ్ గురించి రణబీర్ వ్యాఖ్యానిస్తూ, నిఅవును, షంషేరా ఒక పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్. కనుక, సంగీతం కూడా ఆ కాలానికి సరిపోయేలా చేయాల్సి వచ్చింది. దీంతో అది అందరినీ ఆకట్టుకుంటుంది సినిమాలో చాలా విభిన్నమైన పాటలు ఉన్నాయి. ఇది నేను నిజంగా ఇష్టపడే వివిధ రకాల సంగీతానికి సంబంధించిన మంచి సమ్మేళనాన్ని కలిగి ఉంది. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. షంషేరా కథ కల్పిత నగరం కాజాలో సెట్ చేశారు. ఇక్కడ ఒక యోధులైన తెగను నిర్దాక్షిణ్యమైన అధికార జనరల్ షుద్ సింగ్ ఖైదు చేసి, బానిసలుగా చేసి హింసిస్తుంటాడు. బానిసగా మారిన వ్యక్తి, నాయకుడిగా మారిన బానిస మరియు అతని తెగకు లెజెండ్‌గా మారిన కథ ఇది. అతను తన తెగ స్వేచ్ఛ మరియు గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు. అతని పేరే షంషేరా. హై-ఆక్టేన్, అడ్రినలిన్-పంపింగ్ ఎంటర్టైనర్ 1800ల నాటి భారతదేశపు హృదయ భూభాగంలో సెట్ చేశారు. సినిమాలో షంషేరాగా నటించిన రణబీర్ కపూర్ ఇంతకు ముందెన్నడూ చూడని పెద్ద వాగ్దానాన్ని అందిస్తున్నారు! సంజయ్ దత్ ఈ భారీ కాస్టింగ్ చిత్రంలో, తిరుగుబాటుదారుని పాత్రలో రణబీర్‌కు బద్ధ శత్రువుగా నటించాడు మరియు రణబీర్‌తో అతని పాత్ర చూడదగిన విషయంగా ఉంటుంది. ఎందుకంటే వారు కనికరం లేకుండా క్రూరంగా ఒకరినొకరు వెంబడించుకుంటారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కోలాహలాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇది జూలై 22, 2022న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.