Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌లోని అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 'శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం' అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి. అక్కడ స్టూడెంట్స్‌తో కలిసి చాలా సేపు సినిమా గురించి ముచ్చటించారు. అలాగే ట్రైలర్‌ను వీక్షించారు. అలాగే ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం లవ్ సాంగ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ప్లే చేసారు. కాలేజ్ విధ్యార్థులతో పాటు చాలా సేపు గడిపారు కార్తికేయ 2 యూనిట్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు దర్శక నిర్మాతలు. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ఆయన అన్నారు.