Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో, ఇళయరాజా సంగీతం సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'రంగమార్తాండ'.ఈ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథగా రంగమార్తాండ థియేటర్స్‌కు రానుందని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుందని మేకర్స్ తెలిపారు.ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
ఈ చిత్రానికి దర్శకత్వం: కృష్ణవంశీ, నిర్మాత: కాలిపు మధు, వెంకట్ రెడ్డి, సంగీతం: ఇళయరాజా, ఎడిటర్: పవన్, కెమెరామెన్: రాజ్ కె నల్లి.