Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ''ద్రౌపది'' తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ,'పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది అలాగే యూత్ కి కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి' అని అన్నారు.బొడ్డుపల్లి బ్రహ్మచర్య మాట్లాడుతూ,'రామ్ కుమార్ తను చెప్పిన విధంగానే ఈ కథను అద్భుతంగా మలిచాడు . రామోజీ ఫిలిం సిటీలో పాటలు చిత్రీకరించాం. అలాగే చిత్రీకరణను జగిత్యాల, హైదరాబాదు, పోచంపల్లి వంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం .ఈ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తెస్తుంది' అని తెలిపారు.