Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' చిత్ర ప్రమోషన్‌ను 'కిల్లింగ్ మెషిన్'తో ప్రారంభించారు. ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బీజీయం ఈ గ్లింప్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళింది. అంతేకాదు మరిన్ని భారీ అంచనాలు పెంచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ,''ది ఘోస్ట్'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్‌ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్‌కి కోడ్ నేమ్. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథలో ట్రీట్మెంట్, క్యారెక్టర్ డిజైన్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఈ ట్రెండ్‌కి తగ్గట్టు ఉంది. 'ఘోస్ట్'కి సీక్వెల్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. ఇది మిషన్ బేస్డ్ సినిమా కాదు. మీరంతా రివ్యూలు చక్కగా రాసి సినిమా సూపర్ హిట్ అయితే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు( నవ్వుతూ). ఇందులో యాక్షన్ కథలో కలసి వుంటుంది. యాక్షన్ కూడా ఎమోషన్లో భాగంగా వుంటుంది. యాక్షన్ చాలా ఆర్గానిక్ గా వుంటుంది.నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం' అని అన్నారు 'నాగార్జున గారితో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాగార్జున గారు స్టైలిష్ యాక్షన్‌లో అద్భుతంగా వుంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది' అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పారు.