Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగులో సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతూ టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు మధు నంబియార్. తాజాగా ఆయన సైంటిస్ట్ పాత్రలో నటించిన చిత్రం 'గంధర్వ'. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు మధు నంబియార్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం.నా మదర్ టంగ్ మలయాళం అయినా నేను పుట్టింది మాత్రం ఇక్కడే.నేను డిగ్రీ చదువుతున్న టైంలోనే నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ రావడంతో ఇండియా మొత్తం జర్నీ చేయడం జరిగింది.అలాగే జాబ్ చేస్తూనే ''ూూదీ''పూర్తి చేయడం జరిగింది. 2005 లో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని లాయర్ గా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొన్నాను.ఆ తరువాత సినిమాలలో నటించాలనే కోరిక నాలో బలంగా ఉండడంతో నా ఫ్రెండ్స్ కూడా సినిమాలలో నటించమని ఎంకరేజ్ చేయడంతో నేను గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ లో ట్రైనింగ్ తీసుకున్నాను.అయితే అనూహ్యంగా దీపక్ బల్ దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ వారు తీసిన ''క్వాబ్ సారె ఝాటే'' అను హిందీ మూవీ లో బిజినెస్ మెన్ గా నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. మొదటి సారి బాలీవుడ్ లో నేను నటించిన ఈ పాత్రకు ××ఖీA లో బెస్ట్ సపోర్ట్ యాక్టర్ గా నామినేట్ అవ్వడం విశేషం. ఆ తరువాత నేను వివిధ భాషల్లో నటించడం జరిగింది.