Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్టర్ బాలు, మాస్టర్ మహేష్ సమర్పణలో బి .యం క్రియేషన్స్ పతాకంపై పోసాని కష్ణ మురళి నటీనటులుగా పోసాని కష్ణ మురళి దర్శకత్వంలో నిర్మాత పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న చిత్రం ''వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు''?. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా
నటుడు చిత్ర దర్శకులు పోసాని కష్ణ మురళి మాట్లాడుతూ.. నటుడుగా 400 సినిమాలలో నటించాను, అలాగే రైటర్ గా 100 సినిమాలు రాసింటాను. అలాగే కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేశాను.అయితే దుర్గారావు తీసే సినిమాలో నాకొక క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాకు నేను 12 రోజులు పని చేశాను. ఇన్ని సినిమాలు చేసిన నాకు చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ దగ్గరైన వ్యక్తి పప్పుల కనక దుర్గారావు. దుర్గారావు గారు నాతో నీ పై నాకు చాలా నమ్మకం ఉంది. నీతో సంవత్సరానికి రెండు సినిమాలు చెయ్యాలకుంటున్నాను మీరే కథలను రెడీ చేసుకొండి అని చెప్పడం జరిగింది. అయితే నా కొడుకు ఉజ్వల్ పోసాని కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ కథను నిర్మాత దుర్గరావు వినిపించడంతో తనకీ కథ నచ్చడంతో నన్నే డైరెక్షన్ చేయమన్నాడు.మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను విజయవాడ, కష్ణ బ్యాక్ డ్రాప్ లో చిత్రికరించడం జరిగింది. నిర్మాత దుర్గా రావు గారు నాపై ఉన్న నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాలం ఉన్నంత కాలం కాకపోయినా బ్రతికున్నంత కాలం మనిద్దరం స్నేహితులుగా ఉంటాం.ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులే. సినిమాలో ముగ్గురు అమ్మాయిలు శ్వేత, స్నేహ, శతి నటించారు.