Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరికొత్త సౌండింగ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, సక్సెస్ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్.
ఆయన సంగీత దర్శకత్వం వహించిన 'గంధర్వ' చిత్రం తాజాగా విడుదలై.. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. అలాగే ఆయన సంగీతం అందించిన మరో చిత్రం 'దర్జా'.. ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో 'గంధర్వ' చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,'ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎందుకంటే, 'గంధర్వ' చిత్రంతో మంచి విజయాన్ని అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కర్నాటకలోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాలలో కూడా సక్సెస్ఫుల్ టాక్‌తో రన్ అవుతుంది. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నా మరో చిత్రం 'దర్జా' కూడా ఈ జూలై 22న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 'గంధర్వ' చిత్రాన్ని ఎలా అయితే ఎంజారు చేశారో.. 'దర్జా' కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్గా అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ 'దర్జా'. ఈ చిత్రాన్ని కూడా ఆదరించి.. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమాకి గుడ్ క్వాలిటీ, గుడ్ సౌండింగ్ ఇచ్చేందుకు ఎంతగానో తాపత్రయపడతాను. నేను చేసే ప్రయోగాలను యాక్సెప్ట్ చేస్తున్న ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు' అని చెప్పారు.