Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చక్ర ఇన్ఫోటైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్‌పై కిలారు నవీన్ దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం 'మరో ప్రపంచం'. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం నిర్వహించిన వేడుకలో నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేయగా, పోస్టర్ లుక్‌ను అతిథులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, 'డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి.. అలాంటిది ఓ ఐదుగురి పార్లల్ లైైఫ్లో అలాంటి మార్పులు జరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి ప్రయోగం. అలానే క్వాలిటీతో చిత్రీకరించారు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఆర్ ఆర్.. సినిమాకు హైలెట్ అవుతుందని అనుకుంటున్నా' అని తెలిపారు.
నిర్మాత వెంకటరత్నం మాట్లాడుతూ, ''కష్టం అంతా దర్శకుడు నవీన్‌దే. సబ్జెక్ట్, ఆర్టిస్టులను నమ్మాను. వారందరూ 200 పర్సెంట్ న్యాయం చేశారు' అని చెప్పారు. డైరెక్టర్ నవీన్ మాట్లాడుతూ,'పార్లల్ యూనివెర్సల్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమా కచ్చితంగా మీ అందర్ని అలరిస్తుందని ఆకాంక్షిస్తున్నాం' అని అన్నారు.