Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నృత్యదర్శకుడి నుంచి 'రణం' చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం 'హైరు ఫైవ్'. ఫన్ అండ్ గన్ అనేది ఉపశీర్షిక. రాధా రాజశేఖర్ నిర్మాత. కొత్త, పాత నటీనటుల కలయికతో రూపొందిన ఈ చిత్రం జూలై 22న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఘనంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యతిథి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ,'కోవిడ్ తర్వాత ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. ఓటీటీ అనేది సపోర్టింగ్‌గా నిలిచింది. ఈ సినిమాకు డబ్బులు బాగా వచ్చి అమ్మ రాజశేఖర్ భార్య రాధకు మంచి వసూళ్ళు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, 'హీరో నితిన్‌కు 10 రోజుల క్రితమే ఫంక్షన్ గురించి చెప్పాను. వస్తానని అన్నారు. కానీ ఇంటిలోనే ఉండి రాలేదు. అందుకు చాలా బాధకలిగింది. తనకు డాన్స్ రాదు. నేను డాన్స్ నేర్పించాను. లైఫ్‌లో ఎంత ఎదిగినా అమ్మను, గురువును మర్చిపోకూడదు. నిర్మాత నా భార్య రాధకు థ్యాంక్స్ చెబుతున్నాను. నాతోపాటు సినిమా కష్టాలు పడి విడుదల వరకు తీసుకువచ్చింది' అని చెప్పారు.
నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ, 'మా సినిమా అందరూ బాగా ఎంజారు చేసేలా వుంటుంది' అని తెలిపారు.