Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రామ్ సరసన కతి శెట్టి నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 14న భారీ ఎత్తున సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ది వారియర్' ఫస్ట్ టికెట్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొనుకోలు చేశారు. ఆయనకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ టికెట్ అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్, దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.
రామ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా జర్నీ డిఫరెంట్‌గా స్టార్ట్ అయ్యింది. పోలీస్ కథ చేద్దామనుకున్నాను. ఐదు కథలు విన్నాను. అన్నీ ఒకేలా అనిపించి కొన్ని రోజులు పోలీస్ కథలు వద్దని, వినకూడదని అనుకున్న టైమ్‌లో లింగుస్వామి గారు హైదరాబాద్ వచ్చారు. ముందు పోలీస్ కథ అని చెప్పలేదు. వచ్చాక చెప్పారు. ఫార్మాలిటీ కోసం విందామని అనుకున్నాను. విన్న తర్వాత... పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. నేను స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడూ ట్వీట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు ట్వీట్ చేశా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ రాశానని ఆయన చెప్పారు. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. జీవితంలో మన కంట్రోల్లో ఉన్న పనులు చేస్తాం. లేనివి దేవుడికి వదిలేస్తాం. జీవితంలో ఒకటి సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్లొచ్చని పోలీసుల కథలు విన్న తర్వాత అనిపించింది. 'ది వారియర్' నాకు చాలా ఎమోషనల్ ఫిల్మ్' అని చెప్పారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ, 'దర్శకుడు ఎలా ఆలోచించారో, ఆ ఆలోచనలకు న్యాయం చేయగల హీరో దొరకడం నా అదష్టం. భయంకరమైన టైమింగ్ సెన్స్, షార్ప్ రామ్ సొంతం. డ్యాన్సుల్లో వచ్చి సూపర్బ్. నాకు అదష్టం ఉండి కరెక్టుగా జరిగితే... రామ్‌తో 10 సినిమాలు చేస్తానని అనుకుంటున్నాను. నేను తీసిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూశారు. ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశా. చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. హండ్రెడ్ పర్సెంట్ మంచి సినిమా కుదిరింది' అని చెప్పారు.
కతి శెట్టి మాట్లాడుతూ, 'రామ్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. సాంగ్స్‌లో ఆయన ఎనర్జీ చూశారు... ఎవరూ మ్యాచ్ చేయలేదు. దర్శకుడిగా లింగుస్వామి డైమండ్ అని తెలుసు. ఆయనతో పని చేసిన తర్వాత ఎంత గుడ్ పర్సన్ అని తెలిసింది. నాకు విజిల్ మహాలక్ష్మి రోల్ ఇచ్చినందుకు థాంక్స్' అని అన్నారు.