Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ'. (తెలుగులో 'అమ్మాయి'). పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించి ఈ చిత్రం ఈనెల15వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను వర్మ మంగళవారం మీడియాతో షేర్ చేసుకున్నారు.
ఇది తెలుగులో వస్తున్న మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రం. మన వాళ్లు మార్షల్ ఆర్ట్స్ పేరుతో వైర్స్, వీఎఫ్ఎక్స్, డూప్స్, ఎడిట్లు చేసి మానిప్యులేట్ చేస్తారు. నేను అలాంటివీ ఏమీ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయి ఏం చేయగలదో అది చేయించాను. బ్రూస్లీ కూడా అంతే.. తాను ఏం చేయగలడో అదే ఫైట్. సినిమాటిక్‌గా ఉండదు. ఇందులో మార్షల్ ఆర్ట్స్ కాకుండా ఓ వింత ప్రేమ కథ ఉంటుంది. అది ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాను నలభై వేల స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నాం. పూర్తి మార్షల్ ఆర్ట్స్ సినిమాను తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. అయితే దాని కోసం ఎంతో మంది ట్రైనర్లను వెతికాను. బ్రూస్లీలా ఎవ్వరూ అనిపించలేదు. ఇక అలాంటి వారు దొరకరని వదిలేశాను. పుణెలో పూజా భలెకర్ అని ఓ అమ్మాయి ఉందని తెలిసింది. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మెడల్స్ సాధించింది. ఆమె తన తండ్రితో వచ్చి ఆడిషన్స్ ఇచ్చింది. అప్పుడు ఈ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ రషెస్ చైనాలోని డిస్ట్రిబ్యూటర్ చూసి ఈ సినిమాను ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. నలభై వేల స్క్రీన్స్ అని కాదు..ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇలాంటి కథను మీరు టైగర్ షరాఫ్, హాతిక్ రోషన్లతో చేస్తే ఇంకా భారీ చిత్రమయ్యేది కదా అని చాలా మంది అడిగారు. ఒరిజినాలిటీ మిస్ అవుతుందని వాళ్ళతో తీయలేదు. ప్రస్తుతం అల్‌ఖైదా ఉగ్రవాది మహ్మద్ అట్ట జీవిత చరిత్ర మీద సినిమాను తెరకెక్కిస్తున్నాను' అని చెప్పారు.