Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మోటాటి పల్లి, సిద్ధ రామేశ్వర నగర్ గ్రామాలలో పెంకుటిల్లు కూలిపోయాయి. గ్రామ సర్పంచ్ లు మోటాటి రాజేశ్వరి రాజిరెడ్డి, జనగామ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మోటాటి పల్లి గ్రామానికి చెందిన కుర్మ బయన్న పెంకుటిల్లు కూలిపోగా సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, అలాగే సిద్ధ రామేశ్వర గ్రామంలో సింగం గోదావరి పెంకుటిల్లు కూలిపోగా సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సర్పంచ్ లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిధులు బాధితులను మరో ఇంటిలో నివాసం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా శిధిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి మరో ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని తాహశీల్దార్ నరసింహులు తెలిపారు. వర్షానికి ఇండ్లు కూలిన బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తాహశీల్దార్ తెలిపారు.