Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ' (తెలుగులో 'అమ్మాయి'). ఈ చిత్రం ఈనెల15న విడుదల కాబోతోంది. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సిినిమా విశేషాలను నాయిక పూజా భాలేకర్ మీడియాతో పంచుకున్నారు.
'నేను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదు. నేను చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టాను. నేను ఆర్జీవీ గారికి పెద్ద అభిమానిని. ఆయన్నుంచి ఫోన్ రాగానే ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. బ్రూస్లీకి నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఓ సినిమాతో, ఆర్జీవీ లాంటి దర్శకుడితో నా కెరీర్ స్టార్ట్ చేయడం సరైన ఛాయిస్ అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పాను. అలాగే ఈ సినిమాతో మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికీ చెప్పొచ్చు.. దీనిపై అవగాహన కల్పించగలమని అనుకున్నాను. అమ్మాయిలకు ఇది అవసరం అని చెప్పదల్చుకున్నాను. ఈ సినిమాతో కొంత మందికైనా అవగాహన కలిగి, నేర్చుకుంటారని ఈ సినిమా చేశాను. ఈ చిత్రాన్ని ఇన్ని భాషల్లో విడుదల చేస్తామని అనుకోలేదు. నాకు తెలిసి వర్మ సర్ కూడా అనుకోలేదు. ఈ మూవీలో నా పేరు పూజా కానిక్. పూజాకు బ్రూస్లీ అంటే ఇష్టం. అతను చేసే మార్షల్ ఆర్ట్స్, ఆయన ఫిలాసఫీ అంటే పిచ్చి. ఆయన మీదున్న ప్రేమతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఆమెకు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలతో ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరమని అనుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలతో జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అవన్నీ తెరపై చూడటానికి బాగుంటాయి.మార్షల్ ఆర్ట్స్‌లో నేను ఇప్పటికే ఎంతో సాధించాను. ఇక నా ఈ టాలెంట్‌ను ఉపయోగించుకుని ఇప్పుడు సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను' అని తెలిపారు.