Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రచయిత బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ, '2015లో ఒక వ్యక్తి మరణంతో 'థ్యాంక్యూ' కథ పుట్టింది. దిల్‌రాజుగారు కథలోని సోల్ బాగుందని చెప్పి, డెవలప్ చేయమని చెప్పారు. ఈ కథని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు' అని చెప్పారు. 'చైతన్యగారికి, రాశీగారికి, దిల్‌రాజుగారికి, రవిగారికి అందరికీ థ్యాంక్స్. చాలా మంచి టీమ్ కుదిరింది. కచ్చితంగా సినిమాను అందరూ ఎంజారు చేస్తారు' అని డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ అన్నారు.
నాయిక రాశీ ఖన్నా మాట్లాడుతూ, 'ఎదుటి వారి పట్ల కతజ్ఞతతో ఉండటం అనే దానికి నేను చాలా ప్రాముఖ్యతనిస్తాను. అందుకనే ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఇంత మంచి కథ, స్క్రిప్ట్ రాసిన బి.వి.ఎస్.రవిగారికి థ్యాంక్స్. విక్రమ్ కుమార్‌గారితో కలిసి పనిచేయటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ప్రియా అనే మంచి పాత్రను నాతో చక్కగా చేయించారు' అని తెలిపారు.
'అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైతన్య మూడు వేరియేషన్స్‌లో మీకు కావాల్సినంత భోజనం ఇచ్చేస్తాడు. అభిమానులను చైతు ఎగ్జయిట్ చేస్తాడు. థ్యాంక్యూ సినిమాను ఎందుకు చూడాలి? అభిమానులైతే చైతు కోసం చూస్తారు. మరి కామన్ ఆడియెన్స్ ఎందుకు చూడాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే.. ఈమధ్య మనం ట్రిపుల్ ఆర్ చూశాం.. ఇద్దరు స్టార్ హీరోలను చూసి వావ్ అనుకున్నాం. వారు ఇరగొట్టేశారు. అలాగే కె.జి.యఫ్ చూశాం.పుష్ప చూశాం, సర్కారువారి పాట చూశాం. ఇలా రకరకాల సినిమాలు చూస్తున్నాం. ఇవన్నీ స్టార్ హీరోలతో మనకుండే ఎక్స్‌పీరియెన్స్. అలాగే థాంక్యూ సినిమా చూసినప్పుడు మన హదయంలో ఓ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా మన హదయంలో ఉండిపోతుంది' అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు.
''థ్యాంక్యూ' సినిమా అనేది అభిరామ్ అనే యువకుడి జర్నీ. ఓ యాక్టర్‌గా ఇలాంటి వేరియేషన్స్ చూపించే సినిమా అన్నిసార్లు రాదు. చాలా లేయర్స్‌ను సినిమాలో చూపిస్తున్నాం. లవ్‌స్టోరి, రిలేషన్ షిప్స్, అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య.. ఇలా అన్నింటిని చూపించాం. ఇన్ని వేరియేషన్స్ ఉండటం వల్ల సినిమాలో చాలా స్పాన్ దొరికింది. విజువల్‌గానే కాదు.. మ్యూజికల్‌గా కూడా. రేపు థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుడికి థ్యాంక్యూ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఓ యాక్షన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో అభిమానులు ఎలా హుక్ అవుతారో.. అభిరామ్ జర్నీ స్టార్ట్ కాగానే హుక్ అవుతారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
- అక్కినేని నాగ చైతన్య