Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై తాండ్ర గోపాల్ నిర్మాతగా, బొమ్మారెడ్డి విఆర్ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం 'డెడ్ లైన్'. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ,'ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక అకత్యాల నేపథ్యంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ, మోడరన్ స్క్రీన్‌ప్లేతో ఉత్కంఠ భరితంగా ఉండేలా, అందరినీ ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు' అని తెలిపారు. 'ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు రమణారెడ్డి అన్నారు. నిర్మాత తాండ్ర గోపాల్ మాట్లాడుతూ, 'సినిమా అద్భుతంగా వచ్చింది. అందర్నీ కచ్చితంగా మెప్పించే సినిమా ఇది' అని చెప్పారు. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్, సోనియా, కౌషిక్ తదితరులు ప్రధాన తారాగణం.