Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పకుడు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్న సముద్రఖని లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
''మాచర్ల నియోజకవర్గం' నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని. మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు. నెరిసిన జుట్టు, మెలి తిరిగిన మీసం, నుదుట తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్‌లో కనిపించిన సముద్రఖని పేపర్లపై సంతకం చేస్తూ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చూడటం చాలా క్యురియాసిటీని పెంచింది. ఐఏఎస్ అధికారిగా నితిన్, ఎమ్మెల్యే మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా ఉండబోతోందని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. కతి శెట్టి, కేథరిన్ థ్రెసా ఈ చిత్రంలో కథానాయికలు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ, అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్‌ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు.