Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో సుశాంత్ నటించిన వెబ్ సిరీస్ 'మా నీళ్ల ట్యాంక్'. 8-ఎపిసోడ్ల సిరీస్ ఒక ఫీల్ గుడ్ పల్లెటూరి నాటకం. 10 సంవత్సరాల విరామం తర్వాత నటి ప్రియా ఆనంద్ తెలుగు తెరపై నటిస్తున్న ఈ సిరీస్‌కి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ఈ నెల 15 నుండి జీ5లో స్ట్రీమింగ్ కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుశాంత్ మాట్లాడుతూ,'నేను చాలా వెబ్ సిరీస్ కథలు విన్నాను. కానీ అవేవి నచ్చక ఓకే చెయ్యలేదు. జీ5 నుండి రాధా గారు, లక్ష్మి సౌజన్య 8 ఎపిసోడ్ల స్క్రిప్ట్ చదవమని ఇచ్చారు.నాకు బాగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లోని ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండి పోతుంది. గోపాల్‌గా నటించిన సుదర్శన్ బాగా నవ్విస్తాడు' అని తెలిపారు.
'పది సంవత్సరాల తరువాత ఈ స్టేజ్ పై తెలుగులో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. అందుకు జీ5 వారికి థాంక్స్. నాకు ఇది చాలా స్పెషల్ సిరీస్. సుశాంత్‌తో వర్క్ చేయడం చాలా ఎగ్జయిట్‌గా అనిపించింది. ఒక మంచి క్యూట్ ఏమోషనల్ ఫీల్ గుడ్ స్టోరీ ఇది. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్యతో వర్క్ చేయడం చాలా హ్యాపీ. సురేఖ పాత్రలో నేను చాలా కష్టపడినా, ఎంతో ఎంజారు చేశాను' అని ప్రియా ఆనంద్ తెలిపారు.