Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్యా వర్షిణి అఖిల్, దేవర్షి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బంగారు తల్లి'. శ్రీ విజయ రాము పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను సనత్ నగర్ హనుమాన్ టెంపుల్లో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటుడు బాబుమోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు రాము, శ్రీమతి విజయకు ఈ సినిమాతో మంచి విజయం చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని, ఇందులో తనకు నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు అని హీరో అఖిల్ తెెలిపారు. నాయిక సంధ్యా వర్షిణి మాట్లాడుతూ,'ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సాహిస్తున్న మేకర్స్‌కు థ్యాంక్స్' అని చెప్పారు.
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫుల్ కమర్షియల్, ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని దర్శకుడు ప్రదీప్ అన్నారు. కథకు సంబంధించినంత వరకు ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తామని, షెడ్యూల్ వివరాలను త్వరలోనే తెలియజెస్తామని నిర్మాతలు తెలిపారు. సావిత్రి, రత్నశ్రీ, దేవర్షి, అఖిల్, అపూర్వ, సంధ్యా రాణి, రూప, జగదీష్, శంకర్ మహతి, నాగేంద్ర, శివరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : బొద్దం రాము యాదవ్, శ్రీమతి విజయ, కెమెరా : లక్ష్మణ్, ఫైట్స్ : డైమండ్ వెంకటేష్, ఎడిటింగ్ : సాయి కుమార్ ఆకుల, కొరియోగ్రఫీ : సుబ్బు.