Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థ్యాంక్యూ'.
విక్రమ్‌కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'థ్యాంక్యూ అనే పదాన్ని మనం నిత్య జీవితంలో పలు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ అసలైన ప్రాముఖ్యతను గుర్తించి థ్యాంక్యూ చెప్పే సందర్భంలో మాత్రం చెప్పం. నిజానికి 'థ్యాంక్యూ' అనేది చాలా పవర్ఫుల్ పదం. దానికి మనం విలువ లేకుండా చేశాం. ఇందులో నాగ చైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. అందులో 16 ఏళ్ల పిల్లాడిలా కనిపించే పాత్ర ఒకటి. అలాగే 20-21 ఏళ్ల వయసుండే కుర్రాడిగా కనిపిస్తారు. తర్వాత 35-40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య చాలా కష్టపడ్డారు. 40-50 రోజుల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గి, తన లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైతన్యకే దక్కుతుంది. 'ప్రేమమ్', 'ఆటోగ్రాఫ్' సినిమాలు గొప్ప సినిమాలు. అలాంటి సినిమాలతో మా సినిమాను పోల్చితే మాకు చాలా ప్లస్ అయినట్లే. ఇది ఒక వ్యక్తి జర్నీ. ఈ సినిమాలో ఓ మ్యాజిక్ ఉంటుంది. కచ్చితంగా అది ప్రేక్షకులకు నచ్చుతుంది' అని విక్రమ్ కె కుమార్ అన్నారు.