Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవర్ఫుల్ విలన్ 'గురు' పాత్రలో యువ కథానాయకుడు ఆది పినిశెట్టి నటించిన సినిమా 'ది వారియర్'. రామ్ పోతినేని, కతి శెట్టి జంటగా నటించారు.
తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేనితో పాటు ఆది పినిశెట్టి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ, ''సరైనోడు' తర్వాత విలన్‌గా చేద్దామనప్పుడు 'అజ్ఞాతవాసి' చేశా. అది పవన్ కల్యాణ్ గారి సినిమా. దాని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా దాని కంటే బెటర్‌గా ఉండాలని ఆలోచించా. 'ది వారియర్'లో రోల్ విన్నప్పుడు ఆర్డనరీ విలన్‌గా కాకుండా, 'గురు'కు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది నాకు నచ్చింది. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ప్రేక్షకులు కూడా అలాగే ఫీలై, నేను బాగా చేశానని ప్రశంసింస్తున్నారు. ఈ సినిమాలో గురు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సినిమాటిక్ కమర్షియల్ మీటర్లో ఉన్న పాత్ర. క్లైమాక్స్ తప్ప స్టార్టింగ్ టు ఎండింగ్.. చేసే ప్రతి పనిని గురు ఎంజారు చేస్తూ ఉంటాడు. నాకు ఈ మీటర్ కొత్త కాబట్టి లింగుస్వామి గారు చెప్పింది ఫాలో అయిపోయా. మీరు హీరోగా చేశారు, విలన్‌గా చేశారు. ఏది కంఫర్ట్‌గా అనిపించిందని చాలా మంది అడుగుతున్నారు. నాకు రెండూ కంఫర్ట్‌గా అనిపించాయి. ఆ క్యారెక్టర్స్‌ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడం ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే డిఫరెన్స్ నాకు లేదు. ఇద్దరు హీరోల మధ్య సినిమాలో ఫైట్ ఉంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఓ పాట చిత్రీకరణలా జరిగింది. ఆ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్‌గారు చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. రామ్ గ్రేట్ పెర్ఫార్మర్. గ్రేట్ డ్యాన్సర్. డ్యాన్సర్‌కు ఫైట్‌లో సింక్ కుదురుతుంది. మా నాన్నగారు (రవిరాజా పినిశెట్టి) ఏ సినిమా చూసినా ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. ఈ సినిమా విషయంలో యాస కొంచెం బాగుంటే బాగుంటుందన్నారు. కొన్ని సన్నివేశాల్లో నా పెర్ఫార్మన్స్ బాగుంది, నేను హైలైట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నీకు ఇంత పేరు వచ్చిందన్నారు' అని అన్నారు.