Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్‌కి శ్రీకారం చుట్టింది. జ్యాపి యాప్‌ని రూపొందించిన ఉదరు కోలా, విజరు శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి 'జ్యాపి స్టూడియోస్' పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు.
అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకుడు అనుదీప్, నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర, ముఖ్య అతిథులుగా బ్యానర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. వేడుకగా జరిగిన బ్యానర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి 'జ్యాపి స్టూడియోస్' బ్యానర్, పోస్టర్ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో మొత్తం నాలుగు చిత్రాలను ప్రకటించారు నిర్మాతలు.
'జ్యాపి స్టూడియోస్' నిర్మాణంలో ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న 'జగమేమాయ' పోస్టర్ని నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్, మరో చిత్రం 'పతంగ్' పోస్టర్ని దర్శకుడు అనుదీప్, రాజ్ తరుణ్ హీరోగా ప్రొడక్షన్ నెంబర్ 3, అలాగే సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రొడక్షన్ నెంబర్ 4 పోస్టర్ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేసి నిర్మాతలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'జ్యాపి స్టూడియోస్' త్వరలో నాలుగు ప్రాజెక్ట్స్‌ని మొదలుపెట్టబోతుంది. ఈ ప్రాజెక్ట్స్ మంచి విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'ప్రస్తుతం ఆడియన్స్‌కి చాలా కంటెంట్ అవసరం ఉంది. ఆ నమ్మకంతోనే 2019లో జ్యాపి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ స్టార్ చేశాం. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాం. ప్రేక్షకులను మెప్పిస్తామనే నమ్మకం ఉంది' అని జ్యాపి స్టూడియోస్ నిర్మాతలు చెప్పారు.