Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా'. జివిఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని మూడవ సాంగ్ 'హే పోరి నా పోరి..' అంటూ సాగే టీజింగ్ సాంగ్‌ని సీనియర్ హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,' ఈ సాంగ్ చూసాను. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. యూత్ టీజింగ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ సాంగ్ మరో మంచి ఆల్బమ్‌గా నిలుస్తుంది. ఈ చిత్రంలో అన్ని అంశాలు ఉంటాయానేది తెలుస్తుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను' అని అన్నారు దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ, 'పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా హీరో తేజ మంచి ఎనర్జీతో నటించారు. ఆయన నటించిన గత చిత్రాల కంటే ఆయన లుక్స్ ఈ చిత్రంలో మరింతగా ఆకర్షిస్తాయి. ప్రేమ కథతో వినోదాన్ని మిక్స్ చేసిన ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని సాధిస్తుంది' అని తెలిపారు. నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ,'మా సాంగ్‌ని సుమన్ గారు లాంచ్ చేయటం మా యూనిట్‌కి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది' అని అన్నారు.