Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు రవితేజ, శరత్ మండవ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. రామారావుగా రవితేజ ఎంట్రీ మెస్మరైజింగా అనిపించింది. ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్‌లు, రవితేజ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా కథపై ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచేసింది. ఒక ప్రాంతంలోని వ్యక్తులు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ఆపరేషన్ వెనుక ఉన్నదెవరు? ఈ మిస్టరీని రామారావు ఎలా చేధిస్తాడనేది ట్రైలర్లో చాలా గ్రిప్పింగా చూపించారు. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన వేణు తొట్టెంపూడి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అలాగే ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదల కానుందని చిత్ర బృందం తెలిపింది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ, 'దర్శకుడు శరత్ అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది కదా.. నాకైతే చాలా నచ్చేసింది. సత్యన్ సూర్యన్, సామ్ సిఎస్ మిగతా టెక్నిషియన్లు అద్భుతంగా పని చేశారు. దివ్యాంశ కౌశిక్ అందంగా ఉంది' అని చెప్పారు.
'తెలుగు చిత్ర పరిశ్రమలో రవితేజ గారు వుండటం ఒక పెద్ద అదష్టంగా భావిస్తున్నా. నాలాంటి వారిని చాలా మందిని ఆయన పరిచయం చేశారు. కొత్త ఆలోచనలు వినడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. నా టీం అందరికీ కతజ్ఞతలు. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం ఆనందంగా వుంది. ఈనెల 29న అందరూ థియేటర్‌కి రండి. 'రామారావు ఆన్ డ్యూటీ' మిమ్మల్ని అన్ని రకాలుగా అలరిస్తుంది' అని దర్శకుడు శరత్ మండవ తెలిపారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.'ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన అభిమానులకు, అతిథులకు కతజ్ఞతలు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది' అని చెప్పారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'రవితేజ మాస్ మహారాజా మాత్రమే కాదు మంచి మనసున్న మహారాజా. చాలా దర్శకులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్ దర్శకులను చేశారు. 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్, సాంగ్స్ అన్నీ అద్భుతంగా వున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా ఎక్స్ట్రార్డినరీగా వుంది. దర్శకుడు శరత్ అద్భుతంగా తీశారని ట్రైలర్ చూస్తే చెప్పకనే చెబుతుంది. నిర్మాతలకు, నటీనటులకు అందరికీ ఆల్ ది బెస్ట్. 'రామారావు ఆన్ డ్యూటీ' 29న వస్తోంది. ఆ రోజు మీరు కూడా ఆన్ డ్యూటీ' అని అన్నారు.
దర్శకులు సుధీర్ వర్మ, వంశీ, త్రినాథ రావ్ నక్కిన, నాయిక దివ్యాంశ కౌశిక్, నాజర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.