Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కికేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ, 'వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావటానికి ప్రేక్షకులే కారణం. మీకు మంచి సినిమా ఇవ్వాలనేదే నా లక్ష్యం. మా కేరాఫ్ అడ్రస్ అభిమానులని మీ ఎనర్జీ చూస్తేనే అనిపిస్తుంది. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే చేరిన గమ్యానికి విలువ ఉండదని ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ గురించి ఆలోచించినప్పుడు నాకు వైజాగ్ గుర్తుకు వస్తుంది. నా సక్సెస్ స్టోరికి పెద్ద రీజన్ వైజాగ్. మనం రోజు థ్యాంక్యూ అనే పదాన్ని వాడుతుంటాం. కానీ అవసరం ఉన్న చోట వాడం. థ్యాంక్యూ పదానికి అసలు అర్థాన్ని ఈ సినిమా నేర్పించింది. సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్యూ చెప్పటానికి సిగ్గు పడకూడదు. ఈ సినిమా చేసిన రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. 'మనం'లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ .. అలాంటి మరో గొప్ప సినిమాను ఈ రూపంలో ఇవ్వబోతున్నాడు. రవి ఈ కథను ఇచ్చాడు. 'మజిలీ' సినిమాను తమన్ ఏడు రోజుల్లో ఎలా చేశాడో నాకు తెలియదు. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేశాడు. ప్రతి పాట అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ కూడా అలాగే ఉంది' అని తెలిపారు.
డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ, 'మా నాన్నగారికి, నా ప్రియమైన స్నేహితుడు చైతన్యకి, పీసీ శ్రీరామ్ గారికి థ్యాంక్స్. చైతన్య ప్రయాణం ఇప్పుడే మొదలైంది. తను ఇంకా ఎంతో సాధించాలి. సాధిస్తాడు. ఇంత మంచి సినిమాలో భాగమైనం దుకు చాలా ఆనందంగా ఉంది. మంచి కథ ఇచ్చిన దిల్ రాజు, రవి, మ్యూజిక్ అందించిన తమన్, ఎడిటర్ నవీన్ నూలికి, నా డైలాగ్ రైటర్స్ సహా అందరికీ థ్యాంక్స్' అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ, 'మనం లైఫ్ జర్నీలో ఈ స్థాయికి రావటానికి ఎంతో మంది సాయం చేసుంటారు. వారెవరూ లేకపొతే మనం ఏ పని చేయలేం. నా జీవితంలో జరిగిన మంచి విషయంలో థ్యాంక్యూ సినిమా చేయటం. ఈ సినిమాకు సంగీతం అందించే సమయంలో నా గురువులు కీరవాణిగారు, మణిశర్మగారు, రాజ్ కోటిగారికి థ్యాంక్స్ చెప్పాను. ఈ సినిమా చూసిన తర్వాత మీకు సపోర్ట్ చేసిన వారందరూ మీ మైండ్‌లో కదులుతారు. మన జీవితంలో జరిగిన అన్ని విషయాలు.. గుర్తుకు వస్తాయి. ఇంత మంచి వండర్ఫుల్ సినిమా ఇచ్చినందుకు విక్రమ్‌కి థ్యాంక్స్. చైతన్య ఈ సినిమాలో అద్భతంగా ఉన్నాడు. కమిట్మెంట్తో సినిమా చేశాడు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.
రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ, 'థ్యాంక్యూ అనే పదం గురించి చెప్పడానికి.. పదం డెప్త్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. మేం మాకు వీలైనంత మేరకు ఆ డెప్త్ గురించి చెప్పడానికి ప్రయత్నించాం. గ్రాట్యిట్యూడ్ అనే పదం మన గుండెల్లో నుంచి రావాలి. ఫ్రెండ్ షిప్ చిన్న చిన్న గొడవల కంటే చాలా గొప్పది. దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నమే థాంక్యూ సినిమా. నాకు చాలా ఇష్టమైన బాబారు చనిపోయినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో రాస్తున్నప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం ఇంత గొప్పగా ఉందా? అనిపించింది. దాంతో నేను ఓ కథను తయారు చేసి రాజుగారికి చెప్పాను. నాగచైతన్య, విక్రమ్ కుమార్‌గారు దీన్ని అద్భుతం చేశారు. మనం ఇంత దూరం ఎలా వచ్చాం.. అని ఆలోచించి వారందరికీ థ్యాంక్యూ చెప్పే సినిమానే ఇది' అని చెప్పారు.
వైజాగ్తోమంచి అనుబంధం ఉంది. అక్కినేని అభిమానులు ఈ ఎనర్జీని ఈనెల 22 వరకు ఉంచుకోండి. చైతన్యను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా చూసి ఎంజారు చేస్తారు. ఈ సినిమాలో చైతన్య మూడు వేరియేషన్స్ స్క్రీన్‌పై చూస్తారు. ఈ సినిమాలో బ్యూటీఫుల్ లవ్ స్టోరి, కాలేజ్ స్టోరి, లైఫ్ స్టోరి ఉంటుంది. చైతన్య మూడు వేరియషన్స్ను అద్భుతంగా చేేసిన చైతన్యకు, చేయించుకున్న విక్రమ్‌కు థ్యాంక్స్. తమన్ ప్రేక్షకులకు హత్తుకునేలా సినిమాకు సంగీతాన్ని అందించారు. పీసీగారు సినిమాను అందమైన పెయింటింగ్‌లా చేశారు. రాశీ ఖన్నా, మాళవికా, అవికాకి థ్యాంక్స్. మూడేళ్ల కష్టం ఈనెల 22న మీ ముందుకు వస్తుంది. సినిమా అద్భుతంగా ఉంటుంది.
- నిర్మాత దిల్‌రాజు