Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కుమార్, హుమరు చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'. మిథున ఎంటర్టైన్మెట్స్ ప్రై.లి సమర్పణలో సైన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎం.అర్జున్ నిర్మించారు.
జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లింగ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ, ''సతీష్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఆయన కథ నెరేట్ చేసిన దాని కంటే చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను నిర్మించటంలో నిర్మాతగా నా వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాను. హీరో హీరోయిన్లు చక్కగా నటించారు. యూనివర్సల్ పాయింట్ కావటంతో సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.
'ఇదొక డిఫరెంట్ లవ్ ఎంటర్టైనర్. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత అర్జున్‌గారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.