Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రెగ్యులర్ స్టోరీలా కాకుండా ఈ సినిమాలో భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో అందమైన, పవిత్ర మైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే అందమైన పవిత్రమైన ప్రేమను చూపించాం' అని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. జివిఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా'. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ఆగష్టు 19న విడుదలకు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ, 'దర్శకుడు వెంకట్ చెప్పిన పల్లెటూరి నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రేమ కథతో పాటు వినోదాన్ని మిక్స్ చేసి తెరక్కించిన ఈ చిత్రంలో యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఇది మ్యూజికల్ ఎంటర్టైనర్గా మంచి విజయాన్ని సాధిస్తుంది' అని తెలిపారు.
చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ, 'ద్వారకా తిరుమలలో చిత్రీకరణ చేశాం. అనుకున్న టైమ్‌కు, అనుకున్న బడ్జెట్లో తీశాం. అందరినీ మెప్పించే సినిమా ఇది' అని అన్నారు. 'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా నటుడిగా నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది' అని హీరో తేజ్ కూరపాటి చెప్పారు. హీరోయిన్ అఖిల ఆకర్షణ మాట్లాడుతూ,'ఇప్పుడొచ్చే సినిమాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు.