Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం 'మీలో ఒకడు'. సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ ఈనెల 22న థియేటర్స్‌లో గాండ్గా రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ, 'చిరంజీవి, బాలకష్ణ, పవన్ కళ్యాణ్.. ఇలా చాలా మంది హీరోల స్ఫూర్తితో హీరో కావాలని ఇండిస్టీకి వచ్చాను. నా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమాని కంప్లీట్ చేశాను. ఈ నెల 22 రిలీజ్ అవుతున్న మా మూవీని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హ్రితిక సింగ్, సాధన పవన్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి కథ, ఐడియా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కుప్పిలి శ్రీనివాస్, రచయిత: ధరణికోట శివరాంప్రసాద్, పర్యవేక్షణ: కె.ప్రశాంత్, మ్యూజిక్ : జయసూర్య బొంపెం, డాన్స్: అమ్మ రాజశేఖర్, డి.ఓ.పి: పి. శ్రీను, ఫైట్స్: హంగామా కృష్ణ, ఎడిటర్: ప్రణీత, ఎన్టీఆర్.