Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో, విలన్, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్...ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గోపీ పాత్రలో నవీన్ చంద్ర నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతిబాబు, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కష్ణ విజరు, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్యించిన ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సిరీస్ విశేషాలను హీరో నవీన్ చంద్ర మీడియాతో షేర్ చేసుకున్నారు.
''పరంపర' వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్‌కీ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్‌ను మీ ముందుకు తీసుకురాగలిగాం. ఈ వెబ్ సిరీస్‌లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్లోనే పవర్ ఫుల్‌గా మారుతుంది. ఫస్ట్ సీజన్లో శరత్ కుమార్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్లో ఆయన కంటే పాత్ర డామినేట్ చేస్తుంంది. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు, ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తాడు. రామ్‌చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదలుకోను' అని నవీన్ చంద్ర తెలిపారు.