Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థ్యాంక్యూ'.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
అందరికీ థ్యాంక్స్ చెప్పే కథ
నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలను నా లైఫ్ తో పోల్చుకోలేదు. ఇప్పుడు థాంక్యూని పోల్చుకున్నాను. రైటర్ రవి నాలుగేళ్ల క్రితం ఈ స్టోరీ నెరేట్ చేశారు. నాకు అందులో పాయింట్ బాగా నచ్చింది. లైఫ్‌లో థ్యాంక్యూ పదాన్ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. అయితే చెప్పాల్సిన వాళ్ళకి సరైన టైమ్‌లో చెప్పం. అందుకే ఎక్కడో స్టార్ట్ అయిన నా లైఫ్‌లో ఆటో మొబైల్స్ నడుపుతున్నప్పుడు, ఎడ్యుకేషన్ టైమ్‌లో, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా గానీ చాలా మంది హెల్ప్ చేశారు. సొసైటీకి దిల్‌రాజుగా కనిపిస్తున్నా. నా జర్నీలో నాకు గుర్తుండో, గుర్తులేకనో నాకు చాలా మంది హెల్ప్ చేసుంటారు. ఇప్పుడు ఆగి వాళ్లను కలిసొస్తే, నా ఎమోషన్స్, వాళ్ల ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేదే కథ. నేను బాగా కనెక్ట్ అయ్యాను.
అందుకే విక్రమ్‌కి అప్పగించాం
ఇందులో మీరో పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. కాలేజ్, టీనేజ్, లైఫ్... అన్నిటినీ డిజైన్ చేశాం. రవి ఐడియాని మేం అందరం కూర్చుని డిజైన్ చేసి, మంచి కథ చేశాం. ఎవరు డైరక్ట్ చేస్తే బావుంటుందా? అని ఆలోచించాం. ఇద్దరు, ముగ్గురు డైరక్టర్ల పేర్లు అనుకున్నాం. అప్పుడు నాకు విక్రమ్ గుర్తొచ్చాడు. 'గ్యాంగ్‌లీడర్' సినిమా ప్రివ్యూ చూడ్డానికి వెళ్లా. స్టార్ట్ కావడానికి పది నిమిషాలు టైమ్ ఉందంటే, అప్పుడు విక్రమ్‌కి ఈ పాయింట్ చెప్పా. విక్రమ్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్లో రాయమని ఇచ్చాను. దీన్ని అద్భుతంగా తీశాడు.
నెల రోజుల్లో ఇండిస్టీని కొత్తగా చూస్తారు
ఒక నార్మల్ కుర్రాడు, ఒక లెజెండరీ అయ్యాడు. అతను మొత్తం నాది అని అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, కమర్షియల్ యాంగిల్స్ అన్నీ కలిపితే ఈ సినిమా. ఈ సినిమాను డిజైన్ చేయడం బిగ్ జర్నీ. ప్రేమమ్లాగా మూడు స్టోరీలున్నాయి. ఆటోగ్రాఫ్లాగా ఉంది అని అనడం కూడా విన్నాను. మూడు కథల్లో.. మూడు గెటప్స్‌తో చైైతన్య ఎక్స్ట్రార్డినరీ జాబ్ చేశాడు. టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా నా చేతిలో ఉండదు. అది ప్రొడ్యూసర్ కాల్. నా సినిమాని ఇప్పుడు 100 ప్లస్ జీయస్టీ ఇస్తున్నాం. మల్టీప్లెక్స్‌లో 150 ప్లస్ జీయస్టి. ప్రస్తుత పరిస్థితులపై నిర్మాతలందరూ చర్చిస్తున్నాం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే మా లక్ష్యం. నెల రోజుల్లో ఇండిస్టీని అందరూ కొత్తగా చూస్తారనే నమ్మకం నాకు ఇంది. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.