Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటించిన తాజా సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన సాహి సురేష్ మీడియాతో షేర్ చేసుకున్న విశేషాలు..
''భైరవ ద్వీపం' చూసిన తర్వాత ఆర్ట్ విభాగంపై ఇష్టం పెరిగింది. యాదృచ్ఛికంగా ఆ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా చేసిన పేకేటి రంగా గారి దగ్గర చేరటాన్ని అదృష్టంగా భావించాను. తర్వాత అశోక్, ఆనంద్ సాయి గారితో పని చేశాను. వారి దగ్గర పని చేయడంతో ఆర్ట్ విభాగంపై మంచి పట్టు దొరికింది. 'శక్తి' సినిమాకి పని చేస్తున్నపుడు అశ్వనీదత్ గారు నా ప్రతిభని గుర్తించి 'సారొచ్చారు' సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. రవితేజ గారు కొత్త వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఇప్పటివరకు 40 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పని చేశాను. ఈ సినిమా నాకొక ఛాలెజింగ్ మూవీ. ఇది 95లో రూరల్ జరిగే కథ. ఆ నేపథ్యాన్ని దాదాపు మొత్తం రీ క్రియేట్ చేశాం. దీని కోసం చాలా రీసెర్చ్ చేశాం. అప్పటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్..ఇలా అద్భుతమైన సెట్స్ వేశాం. అలాగే పాటల కోసం కూడా గ్రాండ్ సెట్స్ వేశాం. రవితేజ గారికి ఎమ్మార్వో ఆఫీస్ సెట్ చాలా నచ్చింది. శరత్ కొత్త దర్శకుడైనప్పటికీ ఆయనకి చాలా క్లారిటీ ఉంది. అలాగే మా నిర్మాతలు నేను అడిగిన ప్రతిదాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందించారు' అని సాహి సురేష్ చెప్పారు.