Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థాంక్యూ'.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు.
ఈ స్క్రిప్ట్ దొరకటం అదృష్టం
ఈ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు, 36 ఏళ్లు ఇలా రకరకాల ఫేజెస్ చూపించాం. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. 16 ఇయర్స్ నుంచి 36 ఏళ్ల వరకు త్రీ వేరియేషన్స్‌లో కనిపించే స్క్రిప్ట్ రాగానే సవాల్‌గా అనిపించింది. అందుకే గ్రీన్‌సిగల్ ఇచ్చాను.
ఆద్యంతం భావోద్వేగభరితం
ఈ మూవీలో అభిరామ్ జర్నీ గురించి విక్రమ్, రవి, దిల్‌రాజుగారు వచ్చి చెప్పినప్పుడు నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. విక్రమ్ సెన్సిబుల్ విషయాలను చాలా బాగా డీల్ చేస్తారు. దిల్‌రాజుగారితో 12 ఏళ్ల తర్వాత సినిమా చేశాను. 'ప్రేమమ్'లో నేను చేసింది, మనిషి జీవితంలో లవ్‌స్టోరీస్ వల్ల ఎలా ఇన్ఫ్లుయన్స్ అవుతాడు అనే పాత్రని. కానీ ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు అనేది ఇంపార్టెంట్. సినిమా ఓపెనింగ్, ఎండింగ్ దాదాపు 70% విదేశాల్లో చేశాం. కొంత భాగం రాజమండ్రి, వైజాగ్ పరిసరాల్లో చిత్రీకరణ చేశాం.
వ్యక్తిగా నన్ను మార్చిన సినిమా
ఈ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను. అందరీ ఎమోషన్స్‌ని టచ్ చేసే సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా రోల్ చాలా కీలకం. తన వల్లే హీరో ప్రయాణం మొదలవుతుంది. అలాగే మాళవికా నాయర్, అవికా గోర్ పాత్రలు చాలా బాగుంటాయి.
మెగాస్టార్ సమర్పకుడిగా ఉండటం హ్యాపీ
బ్యాక్ టు బ్యాక్ 'లవ్‌స్టోరీ', 'థ్యాంక్యూ', 'ధూత' అన్నీ చేసేశా. ఇవన్నీ కోవిడ్ ముందే చేయాల్సింది, కుదరలేదు. ఆ టైమ్‌లోనే 'లాల్‌సింగ్ చద్దా' ఆఫర్ వచ్చింది. ఆమిర్‌ఖాన్ చాలా మంచి టీచర్. ఆయనతో మనం సమయం గడిపితే, చాలా నేర్చుకుంటాం. చిరంజీవిగారు ప్రీమియర్ చూసి థ్రిల్ ఫీలయ్యారు. ఆయన మా సినిమాను సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమాలో నాది పోలీస్ ఆఫీసర్ పాత్ర. తరుణ్ భాస్కర్ కూడా మంచి పాయింట్ చెప్పాడు. అది కూడా డిస్కషన్లో ఉంది. అయితే పరుశురామ్గారి సినిమా స్టోరీ ఇంకా లాక్ కాలేదు. ఓ పాయింట్ అనుకున్నాం. ఇంకా చర్చలు జరుగుతున్నాయి.