Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ 'శాసనసభ'.
వేణు మడికంటి దర్శకత్వంలో సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై సాప్పని బ్రదర్స్‌గా పాపులరైన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్‌పోస్టర్ విడుదల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, 'ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్ అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'ఈ చిత్రానికి రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్ కథ ఇచ్చారు. నాకు ఎటువంటి ఇమేజ్ లేకపోయినా ఇంత బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను నా జీవితంలో మరిచిపోలేను. ఈ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది' అని ఇంద్రసేన చెప్పారు.
నిర్మాత షణ్ముగం సాప్పని మట్లాడుతూ, 'కథలోని కంటెంట్ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. నిర్మాతలుగా మాకు మంచి గుర్తింపు తెస్తుంది' అని తెలిపారు. రచయిత రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ, '25 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా, పీఆర్ఓగా పనిచేశాను. ఈ చిత్రంతో రచయితగా మారాను. అద్బుతమైన కథ కుదిరింది. ఈ కథను ఇంద్రసేనతోపాటు నిర్మాతలు నమ్మి, లావిష్‌గా నిర్మించారు' అని చెప్పారు. 'ఓ సరికొత్త పాయింట్‌తో వస్తున్న ఈ సినిమా దర్శకుడిగా నాకు మంచి గుర్తింపునిస్తుంది' అని దర్శకుడు వేణు మడికంటి అన్నారు.