Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం
'సీతా రామం'.
దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'కానున్న కళ్యాణం' అంటూ
సాగే మూడవ పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్ డాన్స్ చేసి, ఆహుతులను మెస్మరైజ్ చేశారు.
విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సింధూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా ఉంది. అగ్ర గీత రచయిత సిరివెన్నెల ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా ఉంది. 'కానున్న కళ్యాణం ఏమన్నది?, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది?..' పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, 'ఇలాంటి అందమైన పాట చేయడం నా కెరీర్లో ఇదే మొదటిసారి. కాశ్మీర్‌లోని మంచు, అక్కడి డ్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌తో అందంగా తీసిన పాట ఇది. మోస్ట్ రొమాంటిక్, విజువల్ వండర్ లాంటి సాంగ్ ఇది. ఈ పాటని మీ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.