Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం 'దర్జా'. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేసి, చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ, 'దర్జా అంటే రాయల్టీ. స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి కథ తెరపైకి వచ్చిందని చెప్పగలను. అనసూయగారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు' అని తెలిపారు. 'మంచి కథతో రూపొందిన ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని సమర్పకుడు కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ, 'అందరి సపోర్ట్‌తో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మా కష్టానికి తగినట్లుగానే ప్రేక్షకులు మాకు సక్సెస్‌ను ఇస్తారని భావిస్తున్నాం' అని అన్నారు. 'ఈ సినిమాలో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. ఇది అద్భుతమైన సినిమా. మా సినిమాని చూసి ఆదరించండి' అని అనసూయ తెలిపారు.