Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నటరత్నాలు'. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ నటరత్నాలుగా, రామ్ గోపాల్ వర్మ వెండితెరకు పరిచయం చేసిన ఇనయా సుల్తాన హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు నర్రా శివనాగు మాట్లాడుతూ, 'నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉండే చిత్రమిది. మర్డర్ మిస్టరీ, క్రైమ్ నేేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ సినిమా యూత్నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంద నడంలో ఎలాంటి సందేహం లేదు. టాకీ పనులు పూర్తయ్యాయి. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది' అని తెలిపారు.
'ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసి, అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది' అని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. ఈ చిత్రానికి సిహెచ్ నాగమధు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.