Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'స్పార్క్ 1.0' (ఒన్ పాయింట్ ఓ).
అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేసి, హితేంద్ర నటించి నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే దర్శకుడు సురేష్‌లో మంచి స్పార్క్ ఉందని, నిర్మాతలు సైతం ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా మేకింగ్ చేశారని ప్రశంసించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుందనే ఆశాభావాన్ని శ్రీకాంత్ వ్యక్తం చేశారు.
'మా చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్‌కు కతజ్ఞతలు. ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ మధ్య సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కించాం. ఇలాంటి కథతో రూపొందిన సినిమాలో నటించటం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని హీరో హితేంద్ర తెలిపారు. ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఫైట్స్: రమణ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ : గోపి (అమితాబ్), ఎడిటర్: అనిల్ కుమార్, నిర్మాత: వి.హితేంద్ర, దర్శకత్వం: సురేష్ మాపుర్.