Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో 'శుక్ర' దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా 'మాటరాని మౌనమిది'. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లవ్ స్టొరీ, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో మల్టీ జోనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఈ రోజేదో...' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను యువ హీరో, యాంకర్ ప్రదీప్ మాచిరాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేను కూడా ఈ టీమ్‌లో భాగమే అనుకుంటాను. ఈ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి ట్యూన్‌తో పాటు దర్శకుడు సుకు పూర్వాజ్ కొత్త కాన్సెప్ట్‌తో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పాట మాదిరిగానే త్వరలో విడుదల కాబోతున్న సినిమా కూడా సక్సెస్ కావాలి' అని అన్నారు.
'ఈ రోజేదో కొత్తగా ఉంది. ప్రేమో ఏమో మొదలయ్యింది. ఏ మాయ చేశావో, ఏ మంత్రం వేశావో, గాల్లో తేలుతున్నానే ఇలా... నింగిన దారం తెగిన గాలిపటంలా...' అంటూ ప్రేమికుడి లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగే ఈ పాటకు అషీర్ లూక్ స్వరాలు సమకూర్చగా, డాక్టర్ వాసుదేవ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఆషీక్ అలీ, సోనీ కొమండూరి అందర్నీ అలరించేలా పాడారు. మల్టీజోనర్లో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారని చిత్ర బృందం తెలిపింది. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చరణ్, దర్శకుడు : సుకు పూర్వాజ్.