Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'థ్యాంక్యూ'.
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈనెల 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగ చైతన్య మాట్లాడుతూ, 'ఈ సినిమా నాకు అన్ని రకాలుగా ఛాలెంజింగ్ సిినిమా. ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. 'ప్రేమమ్'లో నేను చేసింది, మనిషి జీవితంలో లవ్‌స్టోరీస్ వల్ల ఎలా ఇన్ఫ్లుయన్స్ అవుతాడు అనే పాత్ర. కానీ ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు అనేది ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మనం ఈ స్థాయికి రావడానికి చాలా మంది కారణమై ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరికీ కచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరుతారు. నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. దర్శకుడు విక్రమ్ ఈ సినిమాలో చాలా సెన్సిబుల్ విషయాలను డీల్ చేశారు. అవన్నీ మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి' అని తెలిపారు.
'రవి చెప్పిన కథ నాకెంతో బాగా నచ్చింది. మన జీవితంలో చాలా మందికి మనం థ్యాంక్యూ చెబుతుంటాం. అయితే ఎవరికైతే చెప్పాలో వారికి సరైన సమయంలో చెప్పం. అలా చెప్పకుండా ఉంటే ఏం మిస్ అవుతాం అనేది ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాం. నా కెరీర్లో తొలిసారి వేరే వారి కథతో ఈ సినిమా చేశాను. అంతగా నా మనసుని టచ్ చేసిన కథ ఇది. నేను ఈ కథని ఎంతగా ప్రేమించానో, అంతకంటే ఎక్కువగా నిర్మాత దిల్‌రాజుగారు ప్రేమించారు. ఈ కథలోని పాయింట్‌కి ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా లైఫ్‌కి బాగా దగ్గరైన సినిమా ఇది అని రాజుగారు చాలాసార్లు చెప్పారు. ఆయనే కాదు రేపు సినిమా చూసిన ప్రేక్షకులు సైతం తమ జీవితాన్ని దీనికి రిలేట్ చేసుకుంటారు. అభిరామ్ జర్నీ చూపించటానికి చైతూ చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం స్క్రీన్ మీద కచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది' అని దర్శకుడు విక్రమ్.కె.కుమార్ తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ,'మంచి కథ దొరికితే దాన్ని ప్రేక్షకుల మనసుకి హత్తుకునేలా ఉండటం కోసం మంచి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 'థ్యాంక్యూ' చాలా మంచి కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. కెరీర్లో ఇలాంటి సినిమాలకు పని చేస్తున్నప్పుడు చాలా గర్వంగా, సంతోషంగా ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా చూసి ఎంజారు చేయండి' అని చెప్పారు.
మా బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి సినిమా 'థ్యాంక్యూ'. రైటర్ రవి ఈ కథ చెప్పినప్పుడు ఇందులోని సోల్‌కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి ఇప్పటివరకు నా జీవితంలో నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చైతూ అద్భుతంగా నటించాడు. విక్రమ్ చాలా బాగా తెరకెక్కించాడు. ఈ సినిమా మనందరికీ గుర్తుండిపోతుంది.
- దిల్‌రాజు