Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర'. దీనికి సీక్వెల్‌గా సీజన్ 2 వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో జగపతిబాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'పరంపర2'కి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో ముఖ్య పాత్ర పోషించిన శరత్‌కుమార్ మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, 'నేను కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్‌లో చేశాను. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. నాకు నచ్చని మోహన్ రావు అనే వ్యక్తి కొడుకు వచ్చి ఎదిరించినప్పుడు మా మధ్య అసలైన గొడవ మొదలవుతుంది. ఇందులో నాయుడు అనే పాత్రలో నటించా. మోహన్‌రావు (జగపతిబాబు) కొడుకు గోపి(నవీన్ చంద్ర) నాయుడును ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందని అనేది ఈ సెకండ్ సీజన్లో చూస్తారు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతూ ఉంటుంది. దర్శకులు విజరు, విశ్వనాథ్, హరి, కెమెరా మెన్ ..ఇలా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్'తోపాటు విజయ్ హీరోగా నటిస్తున్న 'వారసుడు', అలాగే లారెన్స్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాను' అని చెప్పారు.