Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విక్రమ్, అమృత చౌదరి జంటగా సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో రూపొందుతున్న చిత్రం 'విక్కీ ది రాక్ స్టార్'. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ షేడ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమతా' అంటూ సాగే ఈ ఫస్ట్ షేడ్‌లో ఆద్యంతం భావోద్వేగభరిత కంటెంట్ ఉంది. ఎమోషనల్ కంటెంట్‌కు తగ్గట్టుగా సునీల్ కశ్యప్ మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన రాక్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎవ్వరూ చేయని జోనర్‌ని టచ్ చేస్తూ, నేటితరం ఆడియన్స్ కోరుకునే స్టఫ్‌తో ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : సుభాష్, చరిత, సినిమాటోగ్రాఫర్: భాస్కర్, ఎడిటర్: ప్రదీప్ జంబిగా.