Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్' (సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ కనీవిని ఎరుగని రీతిలో భారీగా విడుదలైయింది. తెలుగు ట్రైలర్‌ను చిరంజీవి, ప్రభాస్ విడుదల చేయగా, మలయాళ ట్రైలర్‌ని దుల్కర్ సల్మాన్, హిందీ ట్రైలర్‌ను రణవీర్ సింగ్ రిలీజ్ చేేశారు. హైదరాబాద్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా జరిగింది. అభిమానులు 'లైగర్' టీమ్‌కి స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'అభిమానుల మెంటల్ మాస్ చూస్తుంటే పిచ్చేక్కిపోతుంది. ఈ సినిమా అభిమానులకు అంకితం చేస్తున్నా. ఈ సినిమాలో బాడీ బిల్డప్ చేేయడం, ఫైట్స్ చేయడం ఒక ఎత్తు అయితే డ్యాన్స్ మరో లెవెల్. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని డ్యాన్సులు చేశా. ఆగస్ట్ 25న ప్రతి థియేటర్లో పండగ జరగాలి. ప్రేక్షకులతో నిండిపోవాలి' అని తెలిపారు. 'ట్రైలర్ ఎట్లుంది? విజయ్ ఎట్లున్నాడు? చింపిండా లేదా? లైగర్ గురించి కాదు విజరు గురించి చెబుతున్నా విజరు దేశంలో నెక్స్ట్ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా.. రాసిపెట్టుకోండి. కరణ్ జోహార్ మాకు బిగ్ సపోర్ట్. రిలీజ్‌కి సరిగ్గా ఇంకా నెల రోజులు ఉంది' అని దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు.
కరణ్ జోహార్ మాట్లాడుతూ, 'ఫ్యాన్స్ రాక్స్. రౌడీ రాక్స్. లైగర్ రాక్స్. మీ అందరి ప్రేమకి కతజ్ఞతలు. లైగర్ పై మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. ఆగస్ట్ 25న రిలీజ్ చేస్తున్నాం. మీ అందర్నీ కచ్చితంగా మెప్పిస్తుంది' అని తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, విజరు దేవరకొండ ఫ్యాన్స్ పంచిన అభిమానం చాలా క్రేజీగా ఉంది. వారి కుటుంబంలో ఒకరిగా ఉండాలని ఉంది' నాయిక అనన్య పాండే చెప్పారు.
'విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మీలతో కలసి లైగర్ కోసం పని చేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం' అని అపూర్వ మెహతా, అనిల్ తడాని అన్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.