Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో వరుణ్ సందేశ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'యద్భావం తద్భవతి'. ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఇనయ సుల్తానా కథానాయిక. వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''మైఖెల్' సెట్లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా 'యద్భావం తద్భవతి' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. 'మైఖెల్' సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో, ఈ చిత్రం కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. మాస్కు రీచ్ అయ్యేలా ఉంది' అని అన్నారు.
'అక్టోబర్ వస్తే 'హ్యాపీ డేస్' విడుదలై పదిహేనేళ్లు అవుతుంది. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనేది ఫస్ట్‌లుక్ చూస్తేనే అర్థమవతుంది' అని వరుణ సందేశ్ చెప్పారు. మాస్టర్ భువన్, శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : శరత్ శ్రీకంఠం, రచయితలు : డా.విక్రమ్ భూమి, దాసరి వెంకటేష్, సంగీతం : మిహిరమ్స్, కెమెరామెన్ : కళ్యాణ్ శ్యామ్, ఎడిటర్ : ఆర్ఎమ్ విశ్వనాథ్ కుంచనపల్లి, ఆర్ట్ డైరెక్టర్ : రాజు అడ్డాల, ఫైట్స్ : షావోలిన్ మల్లేష్, కొరియోగ్రాఫర్ : సురేష్ వర్మ.