Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో చిత్ర నాయికల్లో ఒకరైన రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు.
'నేను తమిళంలో నటించిన 'కర్ణన్' సినిమా చూసి దర్శకుడు శరత్
ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఇది అద్భుతమైన కథ. ఇందులో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. మరో భాషలో పరిచయం అవుతున్నప్పుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం, అలాగే రవితేజ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.
దర్శకుడు శరత్ గారు చాలా పర్ఫెక్షనిస్ట్. ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఇది మాస్ ఫిల్మ్, చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్, డ్యాన్స్ ఉన్నాయి. అంతేకాదు పవర్ఫుల్ కంటెంట్ ఉన్న కథ కూడా. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ప్రస్తుతం 'మలయంకును'్జ పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. వీటితోపాటు మరో రెండు సినిమాల చిత్రీకరణ మొదలుపెట్టాలి. మంచి కథలు దొరికతే తెలుగులోనూ నటిస్తాను' అని రజిషా విజయన్ చెప్పారు.