Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మంత్ర', 'బటర్ ఫ్లై' చిత్రాల సక్సెస్‌తో మంచి పేరు సొంతం చేసుకున్న జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తున్న తాజా చిత్రం 'ది స్టోరీ అఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్'.
ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఈ బ్యానర్లో నేను 'బటర్ ఫ్లై' సినిమాలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువస్తుంది. 'బ్యూటిఫుల్ గర్ల్' సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.
'ఈ చిత్రానికి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చేశాను. సంగీత దర్శకుడు అర్వీజ్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. గిడియన్ కట్టా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని వేరే లెవెల్‌కి తీసుకువెళ్ళింది. 'జగడం', 'ఎవరు' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిహాల్ కొదాటి హీరోగా ఫుల్ ఎనర్జీతో వర్క్ చేశాడు. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కిన 'మనసా నమః' షాట్ ఫిల్మ్‌లో నటించిన దషికా చందర్ హీరోయిన్గా నటించింది' అని దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి తెలిపారు. చిత్ర నిర్మాత ప్రసాద్ తిరువల్లూరి మాట్లాడుతూ, 'ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ కొత్తవారైనా చాలా హార్డ్ వర్క్ చేశారు.సినిమా ఫలితంపై నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు. 'ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది' అని హీరో నిహాల్ కోదాటి అన్నారు.