Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి లాగిందే' అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ట్రెసాను చూసి రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ కొంటెగా పాడుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఏంటి?, ఎలాంటిదో తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.
కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా, శత్రు భయంకరుడిగా పవర్ఫుల్ పాత్రలో ఎలా మెప్పించారనే విషయాన్ని ట్రైలర్‌తో సింపుల్‌గా టచ్ చేశారు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్, పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. శనివారం రిలీజ్ చేసిన 'ఓ తేనె పలుకుల అమ్మాయి..' వీడియో సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరికుప్పల యాదగిరి ఈ పాటను రాయటంతో పాటు పాటకు అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. హైమంత్ మహ్మద్, సత్య యామిని ఈ పాటను అంతే అద్భుతంగా పాడారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది' అని చిత్ర బృందం తెలిపింది.