Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా. మంచు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.
తండ్రి విష్ణు మంచు హీరోగా నటించిన 'జిన్నా' చిత్రంలో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ ఆలపించారు.
అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.
'ఇదే స్నేహం...' అంటూ సాగే ఈ పాట వీడియోను ఆదివారం విడుదల చేసారు. మంచు సిస్టర్స్ పాడిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, కోటి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, అచ్చు రాజామణి ... సింగర్స్ మనో, గీతామాధురి తదితరులు ఈ మంచు సిస్టర్స్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సంగీత ప్రపంచంలోకి వెల్ కమ్ చెప్పటం విశేషం.
మోహన్‌బాబు, ఆయన కొడుకులు కూతురు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. వీరి బాటలోనే మంచు సిస్టర్స్ సైతం మంచి ఇమేజ్ సొంతం చేసుకోవాలని మంచు ఫ్యామిలీ అభిమానులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపించారు.
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జిన్నా'. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా చోటా.కె.నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ అందించగా, జి.నాగేశ్వరరెడ్డి మూల కథ సమకూర్చారు.