Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు అమీర్‌ఖాన్ అంటే ఇష్టం. అతని వ్యక్తిత్వం, నటన, మేకింగ్ స్టయిల్..ఇలా ప్రతీదీ ఇష్టం. తన నటన నన్నెంతో ఇన్స్పైర్ చేస్తుంది. 'లాల్ సింగ్ చడ్డా'కి సమర్పకుడిగా అడిగితే, వెంటనే అంగీకరించడానికి కారణం ఇదే' అని చిరంజీవి అన్నారు.
అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లాల్ సింగ్ చడా'్డ. ఇప్పటికే బాలీవుడ్లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తెలుగులో ఈ సినిమాను చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, 'ఇన్నేళ్ళ కెరీర్లో నేనెప్పుడూ ఏ సినిమాకీ సమర్పించలేదు. అసలు సమర్పించడం అంటే ఏంటో కూడా తెలీయదు. అలాంటిది అమీర్ అడగ్గానే ఓకే చెప్పాను. ఈ సినిమాలో అమీర్ నటన అందర్నీ మెప్పిస్తుంది. చైతూ ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం కావడం ఆనందంగా ఉంది. తను బాగా నటించాడు. ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను' అని చెప్పారు. 'నా కెరీర్లో రీమేక్‌లు చేశాను. అయితే చాలా తక్కువ చేశా. 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ చిత్రాన్ని మేం రీమేక్ చేశాం. ఈ కథ అంతగా నన్ను మెప్పించింది. ఈ కథలో హీరోకి ఉండాల్సిన హీరోయిజం ఉండదు, పది మందిని కొట్టే పవర్ ఉండదు... కేవలం ఆమాయకత్వమే ఇందులో హీరోకి హీరోయిజం. ఇలాంటి స్క్రిప్ట్‌లు చేయడమంటే నాకెంతో ఇష్టం. ఈ కథని దర్శకుడు అద్వైత్ చందన్ అద్భుతంగా తెరకెక్కించాడు. 'ఫారెస్ట్ గంప్'లో అడాల్డ్కి సంబంధించిన సీన్స్ కొన్ని ఉంటాయి. అయితే మన నేటివిటీకి తగ్గట్టు వాటిలో మార్పులు చేసి, పిల్లలను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాం. ఇందులో నాతోపాటు చైతూ కూడా యాక్ట్ చేశాడు. చైతూకి మంచి పేరు వస్తుంది. ఇక ఈ సినిమాని నా స్నేహితుడు చిరంజీవి సమర్పకుడిగా రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. ఆయన ఏ నమ్మకంతో, ఇష్టంతో ఈ సినిమాని విడుదల చేస్తున్నారో, ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందని ఆశిస్తున్నాను' అని అమీర్‌ఖాన్ చెప్పారు.
నాగచైతన్య మాట్లాడుతూ, 'నేను అమీర్‌ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో కలిసి నటించటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. నాకొక గొప్ప జ్ఞాపకంలా నిలిచిపోతుంది. అమీర్ దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్ళడం ఓ విశేషమైతే, చిరంజీవిగారు ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించటం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాను' అని అన్నారు.